Yasin Malik: 'నేను గాంధేయవాదిని' యాసిన్ మాలిక్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
1990లో కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన యాసిన్ మాలిక్ ఇప్పుడు తాను మారిపోయినట్లు ప్రకటించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ట్రైబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో, 1994 నుంచి సాయుధ పోరాటాన్ని విడిచి పెట్టి, గాంధేయవాదం వైపు మళ్లానని పేర్కొన్నాడు.
హింసను వదిలి, ఐక్యత, స్వతంత్రతతో కూడిన కశ్మీర్ కోసం శాంతియుతంగా పోరాటం చేయడమే తన లక్ష్యమని వెల్లడించాడు.
జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ పై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై సమీక్షించిన UAPA ట్రైబ్యునల్ ఆ నిర్ణయాన్ని సమర్థించింది.
ఈ పరిణామాల మధ్య మాలిక్ తన తాజా అఫిడవిట్‌ను సమర్పించాడు,
Details
సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టాను
ఇందులో గతంలో చేసిన సాయుధ పోరాటాన్ని తాను విడిచిపెట్టానని వివరించాడు.
1990లో శ్రీనగర్‌లో భారత వాయుసేన సిబ్బందిపై జరిగిన దాడిలో యాసిన్ మాలిక్ పాత్ర కీలకమని ఆరోపణలున్నాయి.
జనవరి 25న, శ్రీనగర్ ఎయిర్‌ఫీల్డ్ వద్ద విధులకు సిద్ధమైన వాయుసేన సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
ఈ దాడికి మాలిక్ నాయకత్వం వహించినట్లు ఆరోపణలొచ్చాయి. 1994లో యాసిన్ మాలిక్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే 1995లో కోర్టు విచారణపై స్టే విధించింది.
ఈ సమయంలో జమ్ముకశ్మీర్ లబిరేషన్ ఫ్రంట్ ముక్కలైంది. ఆ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడనే ఆరోపణలు రుజువయ్యాయి.
దీని ఫలితంగా ఆయనకు జీవిత ఖైదు విధించారు. ప్రస్తుతం యాసిన్ మాలిక్ తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.