Chandrababu: 'నాకు భద్రత లేదు' ఏసీబీ కోర్టులో చంద్రబాబు సంచలన కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే.
ఈ కేసులో జ్యూడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది.
గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును పర్చువల్‌గా కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు.
తర్వాత రిమాండ్‌ను నవంబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Details
చంద్రబాబు ఆరోగ్యంపై జడ్జి ఆరా
భద్రత విషయంలో, ఇతర అంశాలపై ఏవైనా సందేహాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని చంద్రబాబును జడ్జి సూచించారు.
చంద్రబాబు నాయుడు లిఖిత పూర్వకంగా ఇచ్చిన లేఖను తనకు పంపాలని జైలు అధికారులను జడ్జి ఆదేశించారు.
మరోవైపు చంద్రబాబు ఆరోగ్య విషయంపై జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇకపై చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్‌లను తనకు అందజేయాలని జడ్జి తెలిపారు.