Dhruv : ధ్రువ్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలకు చెక్ పెట్టిన హెచ్ఏఎల్
భారతదేశం అధునాతన తేలికపాటి హెలికాప్టర్ (ALH) ధృవ్‌లో తలెత్తిన డిజైన్ లోపాన్ని విజయవంతంగా సరిదిద్దారు. ఆర్మీలో ప్రమాద రహిత ప్రయాణాన్ని మెరుగుపర్చేందుకు నియంత్రణ వ్యవస్థకు కానవాల్సిన సమగ్రమైన అప్‌గ్రేడేషన్ ప్రక్రియ నిర్వహించామని సీనియర్ ఆర్మీ అధికారులు చెప్పారు. కొంతకాలంగా ల్యాండింగ్ సమయంలో తలెత్తిన వరుస ప్రమాదాలపై హాల్(HAL), ALH స్క్వాడ్రన్‌లకు కొత్త బూస్టర్ కంట్రోల్ రాడ్‌ల సరఫరాను మొదలెట్టింది. ఈ అప్‌గ్రేడ్ చేసిన రాడ్‌లు మునుపటి అల్యూమినియం వాటిని భర్తీ చేస్తున్నారు. కంట్రోల్ రాడ్‌లు అంటే హెలికాప్టర్ కదలికను నిర్వహించేందుకు పైలట్‌లను ఎనేబుల్ చేసే కీలకమైన భాగం. ఈ రాడ్‌లలో సాంకేతిక లోపం తలెత్తితే రోటర్ బ్లేడ్‌లకు అందే కరెంట్ సరఫరాలో విపరీత మార్పలు జరిగి ప్రమాదాలకు దారితీయవచ్చని కంపెనీ తెలిపింది.
ఇప్పటికే 120 హెలికాప్టర్లకు మరమ్మతులు
120 హెలికాప్టర్లకు సంబంధించిన కంట్రోల్ రాడ్‌లను వివిధ స్క్వాడ్రన్‌లకు పంపించామని HAL హెలికాప్టర్ కాంప్లెక్స్ CEO అన్బువేలన్ పేర్కొన్నారు. నవంబర్ నాటికి మిగిలిన హెలికాప్టర్‌లన్నీ ఈ రాడ్‌లతో మరమ్మతులు పూర్తి చేసుకుంటాయన్నారు. రాడ్ వైఫల్యాన్ని నియంత్రించేందుకు తాజా డిజైన్ మెరుగుదల చాలా ముఖ్యమైందన్నారు. భారత సాయుధ దళాలు దాదాపు 330 ట్విన్-ఇంజిన్ ALHలను ఉపయోగిస్తాయని గుర్తు చేశారు. 2000 దశకం ప్రారంభంలోనే ఈ హెలికాప్టర్ల డెలివరీ మొదలైందన్నారు. ALH ధృవ్ డిజైన్ సమస్యలను ప్రాధాన్యత అంశంగా భావించిన హెచ్ఏఎల్ సంస్థ, ఆగమేఘాల మీద రాడ్ అప్‌గ్రేడ్ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో హెలికాప్టర్ వాయుయోగ్యతను నిర్ధారించి, సమన్వయ పర్చడంలో కీలకమైన ముందడుగు సాధించినట్టైంది.