Page Loader
Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుమతిస్తే.. మోదీకి మహాసభతో సన్మానం: సీఎం రేవంత్‌
బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుమతిస్తే.. మోదీకి మహాసభతో సన్మానం: సీఎం రేవంత్‌

Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుమతిస్తే.. మోదీకి మహాసభతో సన్మానం: సీఎం రేవంత్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 02, 2025
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ధర్మయుద్ధం ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'ఇక మేం ఢిల్లీకి రాబోం, మోదీయే మా గల్లీకి రావాలి.. మా డిమాండ్లకు దిగిరావాలి.. లేకపోతే మీరే దిగిపోవాలంటూ సవాల్ విసిరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరిగిన బీసీ సంఘాల ధర్నాలో ఆయన పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించి అమలు చేయాలని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్‌కోటా కేటాయించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

Details

 బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్‌ నాయకుల పోరాటం 

ఈ మహా ధర్నాకు కాంగ్రెస్‌తో పాటు పలువురు ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్, నటుడు సుమన్ హాజరయ్యారు. అదేవిధంగా, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలేలు పాల్గొని మద్దతు తెలిపారు.

Details

 బీసీల బలం చూపించాల్సిన సమయం వచ్చింది: సీఎం రేవంత్ 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ''ఇకపై బీసీ రిజర్వేషన్ల కోసం మేం ఢిల్లీకి రాబోం. బీసీల బలం గల్లీల్లోనే చూపిస్తాం. బీజేపీ దిగి రావడమో లేక దిగిపోవడమో చూడాలని పేర్కొన్నారు. 'తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకుంటామంటే ప్రధాని మోదీకి ఇబ్బందేంటీ? మేం గుజరాత్‌లో భూమి అడగడం లేదు. బీసీలకు న్యాయమైన వాటా ఇవ్వాలన్నారు. బీసీల హక్కుల కోసం ఢిల్లీలో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సింద హెచ్చరించారు. రిజర్వేషన్ల పెంపుకు అనుమతి ఇస్తే, మోదీని సన్మానిస్తామని తెలిపారు.

Details

 రేవంత్ రెడ్డి రియల్ హీరో : నటుడు సుమన్ 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీల కోసం నిలబడ్డ రియల్ హీరో అని నటుడు సుమన్ ప్రశంసించారు. ''ప్రధాని మోదీ చొరవ తీసుకుని ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని కోరారు. అలాగే ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్ మాట్లాడుతూ బీసీల మేలు కోసం నిజంగా ఆలోచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే చూశానని ప్రశంసించారు.

Details

 కేంద్రమంత్రులతో భేటీకి సిద్ధమైన రేవంత్ బృందం 

మహా ధర్నా అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం కేంద్రమంత్రులతో సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టానికి మద్దతు ఇవ్వాలని వారు కోరనున్నారు. దేశవ్యాప్తంగా బీసీ హక్కుల సాధన కోసం కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని, రిజర్వేషన్ల అంశంలో మోదీ ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.