Page Loader
Jai Shankar: పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి.. జై శంకర్‌
పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి.. జై శంకర్‌

Jai Shankar: పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి.. జై శంకర్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2024
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌ భారత్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్‌ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఐరాస జనరల్‌ అసెంబ్లీ 79వ సెషన్‌లో ఆయన మట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రయోగంగా ఉపయోగిస్తున్న పాకిస్థాన్‌ దానికి తగిన పరిణామాలు తప్పక ఎదుర్కొంటుందని హెచ్చరించారు. పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాద విధానం ఎప్పటికీ విజయవంతం కాదని, కొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల వల్ల వెనుకబడి ఉంటాయని జై శంకర్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ తమ వినాశకరమైన చర్యల వల్లే ఆర్థికంగా క్షీణించిందని, ఈ దుశ్చర్యలు కేవలం ఆ దేశానికే కాదని, పొరుగు దేశాలకు కూడా ఇబ్బందులు తెచ్చిపెడతాయని జై శంకర్‌ పేర్కొన్నారు.

Details

పాలస్తీనా ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు

పాకిస్థాన్‌ గత వేదికల్లో చేసిన కొన్ని వాదనలను కూడా ఆయన ఖండించారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ స్పష్టమైన వైఖరిని చాటుకోవడం అత్యవసరమని చెప్పారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల వాటికి తగ్గ పరిణామాలు తప్పక ఎదురవుతాయని ఆయన హితవు పలికారు. పాక్‌ ప్రధానమంత్రి షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ఐరాసలో తన ప్రసంగంలో జమ్ము-కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. ఆర్టికల్‌ 370 రద్దుపై భారత్‌ చర్యలను తప్పుబడుతూ, వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జమ్ము-కశ్మీర్‌ ప్రజలు కూడా పాలస్తీనా ప్రజల మాదిరిగానే స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.