IFS officer suicide: భవనంపై నుంచి దూకి.. ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాంగశాఖ అధికారి జితేంద్ర రావత్ (Jitendra Rawat) ఆత్మహత్య చేసుకున్నారు.
భవనం పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం దిల్లీ (Delhi)లోని చాణక్యపురి ప్రాంతంలో చోటుచేసుకుంది.
దీనిపై విదేశాంగశాఖ స్పందించింది .విదేశాంగశాఖ (MEA)కి చెందిన రెసిడెన్షియల్ సొసైటీలో ఉన్న అధికారుల నివాస భవనం టెర్రస్ పైనుంచి రావత్ దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఆయన తన తల్లితో కలిసి ఆ ఇంట్లో నివసిస్తున్నారు. అయితే, రావత్ భార్య, ఇద్దరు పిల్లలు ఉత్తరాఖండ్ రాజధాని దేహ్రాదూన్‌లో ఉంటున్నారు.
కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఏ సూసైడ్ నోట్ లభించలేదని దిల్లీ పోలీసులు తెలిపారు.
వివరాలు
బాధిత కుటుంబ గోప్యతను కాపాడేందుకు ఇతర వివరాలను వెల్లడించలేం
విదేశాంగశాఖ అధికారికంగా ఆయన మృతి గురించి ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
"ఈ కఠిన సమయంలో బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. కేసు విచారణలో ఎప్పటికప్పుడు దిల్లీ పోలీసులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం" అని వివరించింది.
బాధిత కుటుంబ గోప్యతను కాపాడేందుకు ఇతర వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేసింది.