
Bangladesh: హైదరాబాద్‌లో అక్రమ వలసదారుల చొరబాటు.. పోలీసుల అదుపులో 20 మంది బంగ్లాదేశీయులు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలో బంగ్లాదేశ్ వాసుల అక్రమ చొరబాట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ శివారు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు నివసిస్తున్నారని పోలీసులు గుర్తించారు. తాజాగా 20 మంది బంగ్లాదేశ్ వాసులను అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు, వారిని భారత సరిహద్దు ప్రాంతంలో ఉన్న బీఎస్‌ఎఫ్‌కు అప్పగించారు. నగరంలో ఇదివరకూ కూడా పలుమార్లు బంగ్లాదేశీయులు పట్టుబడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి అక్రమ వలసదారులను పోలీసులు అదుపులోకి తీసుకుని బీఎస్‌ఎఫ్‌కు అప్పగిస్తున్నారు.
Details
దన
హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతున్నాయి. గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా భారతదేశానికి అక్రమ వలసలు గణనీయంగా పెరిగాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోకి వలసదారులు వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమై, నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టి అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుంటున్నారు.