Cockfighting: భోగి వేడుకల్లో అట్టహాసంగా కోడి పందెలా సందడి
ఈ వార్తాకథనం ఏంటి
భోగి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తున్నారు.
ఈ వేడుకలలో సినిమా తారలు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొంటున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగకు కోడి పందాలు నిర్వహించేందుకు కోడి పందెంకోళ్లు సై అంటున్నాయి.
పందెంకోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారు తమ సత్తాను బరిలో చూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మూడు రోజులపాటు కోడి పందేల కోసం భారీ ఏర్పాట్లు చేస్తారు.
సంక్రాంతి వేళ ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందల నిర్వహణకు సిద్ధమయ్యాయి. ఒక్కో నియోజకవర్గంలో పందెలు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
Details
ఐ.పోలవరం మండలంలో 30 ఎకరాల లే అవుట్
కోనసీమ జిల్లాలోని ఐ.పోలవరం మండలం మురమళ్లలో 30 ఎకరాల లే అవుట్‌లో భారీ ప్రాంగణం సిద్ధం చేసారు.
అక్కడ రేయింబవళ్లూ పందెలు నిర్వహించేందుకు ఫ్లడ్ లైట్లు అమర్చారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు కూడా ఏర్పాటు చేశారు.
అమలాపురం పరిధిలో నాలుగెకరాల స్థలంలో కూడా కోడి పందాల నిర్వహణ జరుగుతోంది. కోనసీమలోని ఆత్రేయపురంలో పదిచోట్ల పందల ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే కృష్ణా జిల్లాలో బాపులపాడు, కంకిపాడు, ఈడుపుగల్లులో భారీ బరులు వెలిశాయి. పందేలు జరగడానికి రేడియోలో ప్రత్యేక ప్రకటనలు కూడా ఉంటాయి.
కోడి పందాలను చూడటానికి, వాటిని కాయడానికి వేర్వేరు జిల్లాల నుండి వం ప్రముఖ వ్యాపారులు, సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు.
Details
ఈనెల 12 నుంచి 15 వరకు నిర్వహణ
కోడి పందాలు ఈ ఏడాది 12 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు.
గతంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే కోడి పందేలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ సంస్కృతి ఎక్కువగా విస్తరించిపోతుంది.
దీంతో కోడి పందెం కోళ్ల డిమాండ్ పెరిగింది. కోడి పందాలకు సంబంధించిన కేసులు మొదటిపెట్టి, చివరికి పోలీసు చర్యలు తగ్గాయి, ఇది పెద్ద విమర్శలు తెచ్చుకుంది.