NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Isha Foundation: ఈశా ఫౌండేషన్​కు సుప్రీం కోర్టులో ఊరట
    తదుపరి వార్తా కథనం
    Isha Foundation: ఈశా ఫౌండేషన్​కు సుప్రీం కోర్టులో ఊరట
    ఈశా ఫౌండేషన్​కు సుప్రీం కోర్టులో ఊరట

    Isha Foundation: ఈశా ఫౌండేషన్​కు సుప్రీం కోర్టులో ఊరట

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 18, 2024
    12:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది.

    సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఈ ఫౌండేషన్‌పై మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

    ఇషా ఫౌండేషన్‌లో తమ కూతుళ్లను బ్రెయిన్ వాష్ చేసి సన్యాసం వైపు మళ్లించారని ఆరోపిస్తూ ప్రొఫెసర్‌ దాఖలు చేసిన కేసును విచారణ రద్దు చేయడంతో పాటు, దీనిపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

    ఈ కేసులో మద్రాస్ హైకోర్టు అనుచితంగా వ్యవహరించినట్టు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

    ఇద్దరు మహిళలు గీత (42) లత (39) మేజర్లు కావడం, వారి ఇష్టపూర్వకంగా ఆశ్రమంలో నివసిస్తున్నందున ఈ పిటిషన్ చట్ట విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

    వివరాలు 

    కేసు పుర్వాపరాలు

    ఇదిలావుంటే, పిటిషనర్ కూతుళ్లలో ఒకరు వీడియో ద్వారా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.

    ఆమె మాట్లాడుతూ,'నేను,నా సోదరి స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా ఈషా ఫౌండేషన్‌లో నివసిస్తున్నాం.ఇందులో ఎవరిపై ఒత్తిడి లేదా బలవంతం లేదు. మా తండ్రి ఎనిమిదేళ్లుగా మమ్మల్ని వేధిస్తున్నాడు'అని కోర్టుకు తెలిపారు.

    ఈషా ఫౌండేషన్‌పై తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది.

    ఆయన కుమార్తెలు గీత,లత ఈషా యోగా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండిపోయారని,ఈశా కేంద్రంలో వారికి బ్రెయిన్ వాష్ చేసి సన్యాసం వైపు మళ్లించారని ఆరోపించారు.

    ఇద్దరు కుమార్తెలను తమకు అప్పగించాలని ఆయన కోరారు.దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, కేసును పరిశీలించి నివేదిక దాఖలు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది.

    వివరాలు 

     ఇద్దరు మహిళలు ఆశ్రమంలో స్వచ్ఛందంగా ఉన్నారు: పోలీసులు 

    ప్రొఫెసర్ చేసే ఆరోపణలను ఈషా యోగా కేంద్రం తోసిపుచ్చింది. "మేము ఎవరినీ పెళ్లి చేసుకోమని లేదా సన్యాసం తీసుకోమని సలహాలు ఇవ్వమని చెప్పలేదు. అందరూ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటారు" అని ఒక ప్రకటనలో పేర్కొంది.

    ఈ నేపథ్యంలో, ఈశా యోగా కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం స్టే విధించింది.

    అలాగే, స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసులకు స్పష్టం చేసింది.

    తాజా సమాచారం ప్రకారం, ఇద్దరు మహిళలు ఆశ్రమంలో స్వచ్ఛందంగా ఉన్నారని అత్యున్నత న్యాయస్థానానికి పోలీసులు వివరించారు. దీంతో కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    సుప్రీంకోర్టు

    #NewsBytesExplainer: SC-ST రిజర్వేషన్లలో అమల్లో క్రీమీలేయర్ ను ప్రభుత్వం నిరాకరించడానికి కారణం ఏమిటి?  కేంద్ర ప్రభుత్వం
    Kolkata Rape Case:కోల్‌కతా హత్యాచార కేసు.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు కోల్‌కతా
    Kolkata Doctor Rape and Murder Case: వైద్యుల భద్రత కోసం సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు  డివై చంద్రచూడ్
    Supreme Court: ఓటుకు నోటు కేసులో ఆళ్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025