Page Loader
జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం

వ్రాసిన వారు Stalin
Jun 23, 2023
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని మచల్ సెక్టార్‌లోని కాలా జంగిల్‌లో శుక్రవారం భారత సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను హతమార్చినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు జేకే పోలీసులు ట్వీట్ చేశారు. ఒక వారంలో రెండో అతిపెద్ద చొరబాటును భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. జూన్ 16న కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదిలా ఉంటే, అనంత్‌నాగ్ పోలీసులు జమ్ముకశ్మీర్‌లోని బిజ్‌భేరా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సానుభూతి పరులను అరెస్టు చేశారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత్‌లో చొరబాటుకు ఉగ్రవాదులు విఫలయత్నం