Page Loader
స్వాతంత్య్ర దినోత్సవ వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం; ఐదుగురు అరెస్టు 
స్వాతంత్య్ర దినోత్సవం వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం; ఐదుగురు అరెస్టు

స్వాతంత్య్ర దినోత్సవ వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం; ఐదుగురు అరెస్టు 

వ్రాసిన వారు Stalin
Aug 14, 2023
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వాతంత్య్ర దినోత్సవం వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం రేగింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది హర్విందర్ సింగ్ అలియాస్ రిండా, కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్-టెర్రరిస్ట్ గోల్డీ బ్రార్‌ గ్రూపులకు చెందిన ఐదుగురిని సోమవారం పంజాబ్ పోలీసులు- కేంద్ర భద్రతా సంస్థ ప్రత్యేక ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. వారి నుంచి రెండు తుపాకులతో పాటు, మ్యాగజైన్‌, 10 లైవ్ కాట్రిడ్జ్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో పంజాబ్ పోలీసులు ఛేదించిన రెండో టెర్రర్ మాడ్యూల్ ఇది. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్-టర్న్-టెర్రరిస్ట్ లఖ్‌బీర్ సింగ్ అలియాస్ లాండాతో సంబంధం ఉన్న ముగ్గురిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులు పంజాబ్‌లో వరుస హత్యలకు ప్లాన్ చేసినట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పంజాబ్ డీజీపీ చేసిన ట్వీట్