LOADING...
ఇస్రో మాజీ చీఫ్ కస్తూరిరంగన్‌కు గుండెపోటు
ఇస్రో మాజీ చీఫ్ కస్తూరిరంగన్‌కు గుండెపోటు

ఇస్రో మాజీ చీఫ్ కస్తూరిరంగన్‌కు గుండెపోటు

వ్రాసిన వారు Stalin
Jul 10, 2023
08:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇస్రో మాజీ చైర్‌పర్సన్, నూతన విద్యా విధాన ముసాయిదా కమిటీ చీఫ్ కె.కస్తూరిరంగన్ సోమవారం గుండెపోటుకు గురయ్యారు. శ్రీలంకలో ఆయనకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆయన్ను చికిత్స కోసం బెంగళూరుకు తరలించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అతని పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. 83 ఏళ్ల కస్తూరిరంగన్ గతంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. కస్తూరిరంగన్ రాజ్యసభ సభ్యుడి(2003-09)గా, భారత ప్రణాళికా సంఘం సభ్యుడిగా కూడా సేవలు అందించారు. ఏప్రిల్ 2004 నుంచి 2009 వరకు బెంగుళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిలకడగా కస్తూరిరంగన్ ఆరోగ్యం