
Bangladesh Crisis: దిల్లీలో షేక్ హసీనా.. యూకే నుండి జైశంకర్‌కు కాల్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటోంది. ఈ క్రమంలో యూకే విదేశాంగ కార్యదర్శితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్‌లో మాట్లాడారు.
ఈ విషయాన్ని 'ఎక్స్' ఖాతా వేదికగా వెల్లడించారు.
హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రభుత్వం పతనం కావడం, ఇతర పరిణామాలపై లామీతో చర్చించినట్లు తెలిసింది.
వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ మాజీ ప్రధాని షేక్ హసీనా యూకే అశ్రయం గురించే చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
భారత్‌లో ఉన్న తలదాచుకుంటున్న షేక్ హషీనా భవిష్యత్తు ప్రణాళిక ఏంటనే విషయంపై ఇప్పటివరకూ భారత్ గానీ, అటు యూకే గానీ స్పందించలేదు.
Details
మరికొంతకాలం దిల్లీలోనే షేక్ హసీనా
షేక్ హసీనా దిల్లీలోనే కొనసాగుతుందా లేక తర్వాత మరో ప్రదేశానికి మారుతుందా అనేది స్పష్టంగా తెలియలేదు.
అయితే, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, ఆశ్రయం కోసం ఆమె ప్రణాళికలు యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నాయా లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్నాయా అనే దానిపై తన తల్లి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
షేక్ హసీనా మరికొంత కాలం ఢిల్లీలోనే ఉంటారని ఆమె కుమారుడు తెలిపారు.
నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నిన్న సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.