Data Leak: 81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్.. దేశంలో ఇదే అతిపెద్ద చౌర్యం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం ఘటన వెలుగులోకి వచ్చింది. డార్క్ వెబ్‌లో దాదాపు 81.5కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' నివేదిక పేర్కొంది.
ఐసీఎంఆర్ వద్ద కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్న 81.5కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటా వివరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటానే లీకైంది.
లీకైన డేటాలో 81.5కోట్ల మంది ఆధార్, పాస్‌పోర్ట్ సమాచారంతో పాటు వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు ఉన్నాయి.
అక్టోబర్ 9న 'pwn0001' పేరుతో ఒక వ్యక్తి 81.5 కోట్ల మంది భారతీయుల ఆధార్, పాస్‌పోర్ట్ వివరాలను థ్రెడ్ పోస్ట్ ద్వారా అమ్మకానికి పెట్టినట్లు రిసెక్యూరిటీ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో రాసింది.
డేటా
ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ CoWinలో డేటా లీక్
మీడియా నివేదికల ప్రకారం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రస్తుతం హ్యాకర్ "pwn0001"పై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
డేటా చౌర్యం గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఐసీఎంఆర్‌కు కూడా తెలియజేసింది.
డార్క్‌వెబ్‌లో డేటా ఉన్న నమూనాను.. సర్వర్‌లో ఉన్న డేటా ఒకటే అని నిర్ధారణకు వచ్చిన తర్వాత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, కేంద్ర ఏజెన్సీలు, ఐసీఎంఆర్‌కు ఈ విషయాన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వివరించింది.
డేటా ఉల్లంఘన జరగడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు జూన్‌లో CoWin వెబ్‌సైట్ నుంచి వీవీఐపీలతో సహా టీకాలు వేసిన పౌరుల వ్యక్తిగత డేటా టెలిగ్రామ్ మెసెంజర్ ఛానెల్ ద్వారా లీక్ కాగా.. ప్రభుత్వం విచారణ చేపట్టింది.
డేటా
గతేడాది ఐసీఎంఆర్ సర్వర్‌పై 6,000సార్లు సైబర్ దాడులు
ఫిబ్రవరి నుంచి ఐసీఎంఆర్ అనేక సైబర్ దాడులను ఎదుర్కొంటోందని 'న్యూస్ 18' వెబ్ సైట్ రాసుకొచ్చింది. ఈ విషయం కేంద్ర కేంద్ర ఏజెన్సీలు, ఐసీఎంఆర్‌కు కూడా తెలుసు.
గత ఏడాది ఐసీఎంఆర్ సర్వర్‌ను హ్యాక్ చేయడానికి 6,000 కంటే ఎక్కువ ప్రయత్నాలు జరిగాయి.
డేటా లీక్‌ను నిరోధించేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని కూడా ఐసీఎంఆర్‌ను కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం చేశాయి. కానీ దిశగా ఐసీఎంఆర్ చర్యలు తీసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య ఆధార్, వ్యక్తుల మొబైల్ నంబర్లు, బ్యాంక్ ఖాతాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడానికి, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న క్రమంలో ఇలాంటి ఘటనలు పెనుసవాళ్లుగా పరణమిస్తున్నాయి.
డేటా
డేటా లీక్‌లో విదేశీయుల హస్తం
డేటా లీక్‌లో విదేశీ నేరస్థులు ఉన్నందున, దానిని ఒక ప్రధాన ఏజెన్సీ ద్వారా దర్యాప్తు చేయడం చాలా ముఖ్యం. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నష్టాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలను కేంద్రం చేపట్టినట్లు తెలుస్తోంది.
కోవిడ్ -19 పరీక్ష కోసం నమోదు చేసిన డేటాను ఎన్ఐసీ, ఐసీఎంఆర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే.. ఈ డేటా ఎక్కడ లీక్ అయ్యిందో ఇంకా ధృవీకరించబడలేదు.
అయితే డేటా లీకేజీపై ఐసీఎంఆర్ ఇంకా స్పందింలేదు. ఈ క్రమంలో ఐసీఎంఆర్ ఫిర్యాదు చేసిన తర్వాత సీబీఐ దర్యాప్తు చేపడుతుందని కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే.. సీబీఐ తన దర్యాప్తును మొదలు పెట్టినట్లు మరికొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏది నిజమో తేలాల్సి ఉంది.