Free bus scheme: హైదరాబాద్ సిటీ బస్సుల్లో .. మెట్రో తరహా సీటింగ్
మహాలక్ష్మి పథకం కింద టీఎస్ఆర్టీసీ లో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సర్వీసును అమలు చేయడంతో రోజుకు 11 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య 18-20 లక్షలకు పెరిగింది. ఈ పరిస్థితుల్లో బస్సు మొత్తం సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉండడం లేదని TSRTC గ్రేటర్ హైదరాబాద్ జోన్ భావించింది. అందుకోసం కొన్ని సీట్లు తొలగిస్తే మరింత మందికి చోటు దొరికే అవకాశముంటుంది. బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లు తొలగించి.. అ స్థానంలో ఇరువైపులా మెట్రో మోడల్ సీటింగ్ మాదిరి సీటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనీ నిర్ణయించుకుంది. దానివల్ల ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుందని ఆర్టీసీ యోచించింది. ప్రయోగాత్మకంగా కొన్ని మార్గాల్లోని బస్సుల సీటింగ్ మార్చింది.
రద్దీ ఎక్కువున్న మార్గాల్లో కొన్ని బస్సులకు సీటింగ్ వ్యవస్థ మార్పు
ఈ విషయTSRTC గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.., మెట్రోలా ఎక్కువ మంది ప్రయాణించడానికి మధ్యలో ఉన్న ఆరు సీట్లు తొలగిస్తే మొత్తం 12 మంది కూర్చొనే అవకాశం కోల్పోతారని, ఆ స్థానంలో బస్సుకు ఇరువైపులా మెట్రోలాగా 5 సీట్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇలా 10 సీట్లు సమకూరుతాయని, గతంతో పోలిస్తే రెండు సీట్లు తగ్గుతాయన్నారు. రద్దీ ఎక్కువున్న మార్గాల్లో కొన్ని బస్సులకు సీటింగ్ వ్యవస్థ మార్చామని తెలిపారు.