Page Loader
Michaug Cyclone: మిచౌంగ్ ముంచేసింది.. చైన్నైలో పెరిగిన మృతుల సంఖ్య.. పునరావస కేంద్రాల్లో ఆకలి కేకలు
మిచౌంగ్ ముంచేసింది.. చైన్నైలో పెరిగిన మృతుల సంఖ్య.. పునరావస కేంద్రాల్లో ఆకలి కేకలు

Michaug Cyclone: మిచౌంగ్ ముంచేసింది.. చైన్నైలో పెరిగిన మృతుల సంఖ్య.. పునరావస కేంద్రాల్లో ఆకలి కేకలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2023
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

మిచౌంగ్ తుఫాను కారణంగా చైన్నై అల్లకల్లోలంగా మారింది. మిచౌంగ్ తుఫాన్ వదిలినా.. ఆకలి కేకలు మాత్రం చైన్నై నగరాన్ని వదలడం లేదు. ఇప్పటికే ప్రాణనష్టంతో పాటు విపరీతంగా ఆస్తినష్టం వాటిల్లింది. చెన్నైతో పాటు చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నపట్నం నీట మునిగింది. ఇప్పటికే మిచౌంగ్ ఎఫెక్టు కారణంగా 12 మంది ప్రాణాలను కోల్పోయారు. చైన్నై పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ వరద ప్రాంతాలను సందర్శించి, బాధితులకు సహాయక సామగ్రి పంపిణీ చేశారు.

Details

విమానాల నుంచి రాకపోకలు ప్రారంభం

మరోవైపు వర్షం తగ్గుముఖం పట్టడంతో విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మరోవైపు పునరావాస కేంద్రంల్లో ఆకలి బాధలు తీరడం లేదు. భారీ వర్షాల కారణంగా సోమవారం చైన్నైలో విమానాల రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఏకంగా వెయ్యికి పైగా విమానాలు బంద్ అయ్యాయి.