
Increased Cold: తెలుగు రాష్ట్రాల్లో అధికమవుతున్న చలి.. 15 డిగ్రీలకు దిగజారిన ఉష్ణోగ్రతలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత రోజురోజుకీ అధికమవుతోంది. దీని వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు దిగజారిపోతున్నాయి.
ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువైంది.
ఇక మంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి 5 గంటల తర్వాత ప్రజలు చలిని నుంచి కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈదురుగాలులు చలితో పాటు, మంచు వల్ల ప్రజలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
కనిష్ట ఉష్ణోగ్రతలు, కొమురం భీం జిల్లా సిర్పూర్ యులో 7.9 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్లిటీ 9.2 డిగ్రీలు, నిర్మల్ పెంబి 10.3 డిగ్రీలు, మంచిర్యాల తపాలపూర్ 12.2 డిగ్రీలు నమోదయ్యాయి.
Details
హైదరాబాద్ లో పెరిగిన చలి
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది.
హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత పెరిగిపోయింది. ఉదయం 9 గంటల తర్వాత కూడా చలి వేయడం గమనార్హం.
అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగులలో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు నమోదు కాగా, రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరింత చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
డిసెంబర్ మొదటి వారంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.