Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ బహుళ వర్ణ లెహెరియా ప్రింట్ టర్బన్
భారతదేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుగుపుకుంటోంది. గత పదేళ్లు ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ధరిస్తున్న తలపాగా హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సారి కూడా నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసే ముందు ప్రధాని మోదీ మల్టీ కలర్ తలపాగా అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని మోదీ ఈ సారి తెల్లటి కుర్తా, చురీదార్‌తో జతగా ఉన్న బహుళ వర్ణ రాజస్థానీ లెహెరియా ప్రింట్ టర్బన్‌ను ధరించారు. 11వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కోసం, మోడీ లేత నీలం రంగు బంద్‌గాలా జాకెట్‌ను కూడా ధరించారు. ఈ తలపాగా నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంది.
2014 నుంచి సంప్రదాయంగా వస్తున్న తలపాగా
ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ రంగురంగుల తలపాగాలను 2014 నుంచి ధరించడం సంప్రదాయంగా వస్తోంది. 2022లో మోదీ జాతీయ జెండా రంగులకు సరిపోయే తలపాగాను ధరించారు.కుంకుమ, ఆకుపచ్చ రంగులతో కూడిన తెల్లటి తలపాగాను మోదీ ధరించారు. 2021లో తలపాగా కుంకుమ రంగులో ఉండే తలపాగాతో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 2020లో కుంకుమపువ్వు,క్రీమ్-రంగు తలపాగాతో ఆకట్టుకున్నారు. 2014లో అయన మొదటి స్వాతంత్ర్య దినోత్సవం ప్రకాశవంతమైన ఎరుపు రంగు జోధ్‌పురి బంధేజ్ తలపాగాను ధరించారు. దాని తర్వాత 2015లో రంగురంగుల క్రిస్-క్రాస్ లైన్‌లతో పసుపు తలపాగా,2016లో పింక్,పసుపు రంగులలో టై-అండ్-డై టర్బన్ ఉన్నాయి. 2017లోప్రధానమంత్రి తలపాగా ఎరుపు,పసుపు రంగుల మిశ్రమాన్ని గోల్డెన్ క్రిస్-క్రాస్ లైన్‌లతో కలిగి ఉంది.అయితే 2018లో,అయన కుంకుమపు తలపాగాను ధరించాడు.
నేటి మోదీ తలపాగా ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఈ రోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ ధరించిన తలపాగా నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంది. తలపాగాకు ఉన్న పొడవాటి తోక కూడా ఈ మూడు రంగుల కలయికలోనే ఉంది. రాజస్థాన్‌కు చెందిన సాంప్రదాయ టెక్స్‌టైల్ టెక్నిక్‌తో దీనిని తయారు చేశారు. ఈ లెహెరియా డిజైన్‌ను థార్ ఎడారిలో కనిపించే 'నేచురల్ వేవ్' నమూనా నుంచి ప్రేరణగా తీసుకొని తయారు చేశారు.