Page Loader
Apple : 'మా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి'.. అలెర్ట్‌ నోటిఫికేషన్లు పంపిన యాపిల్‌

Apple : 'మా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి'.. అలెర్ట్‌ నోటిఫికేషన్లు పంపిన యాపిల్‌

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 31, 2023
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ఇండియా కూటమి, ఎంఐఎం ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు యాపిల్‌ ముప్పు నోటిఫికేషన్‌ల స్క్రీన్‌ షాట్‌లను షేర్ చేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. కేంద్రం తన ఫోన్ హ్యాక్‌ చేసేందుకు యత్నిస్తోందని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా సైతం ఆరోపించారు. అదానీ, కేంద్రం భయం చూస్తుంటే జాలి అనిపిస్తుందన్నారు. మరోవైపు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదికి అలర్ట్‌ వచ్చిందన్నారు. మరోవైపు విపక్షాల ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. వీటికి తాము భయపడబోమన్నారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

details

కేంద్ర ప్రభుత్వంపై ఇండియా కూటమి నేతల ఫైర్

ప్రియమైన మోదీ సర్కార్, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారన్న కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా, అలెర్ట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. శివసేన (UBT) నేత ప్రియాంక చతుర్వేది, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సహా ఇండియా కూటమికి నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు దుమారం రేగుతోంది. రాహుల్ గాంధీ కార్యాలయంలోని కొందరికి ఆపిల్ అలెర్టులు వచ్చాయన్నారు. మరోవైపు ఎంపీల యాపిల్‌ ఐడీ ఆధారంగా స్టేట్‌ స్పాన్సర్డ్‌ అటాకర్స్‌ తమ ఐఫోన్‌, ఈ-మెయిల్స్‌ హ్యాక్‌ చేస్తున్నట్లు సంస్థ హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని ఆపిల్ వెబ్‌సైట్ సపోర్ట్ పేజీ సూచనలు జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్క్రీన్ షాట్ షేర్ చేసిన శశి థరూర్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్క్రీన్ షాట్ షేర్ చేసిన ఎంపీ అసదుద్దీన్