India-China: భారత్- చైనా మధ్య ఇప్పుడు మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి: జైశంకర్
భారత్, చైనాల మధ్య వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణలో కొంత మేర పురోగతి సాధించబడినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ తెలిపారు. ఈ పరిణామం ఒక స్వాగతార్హమైన అంశమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం, ఆస్ట్రేలియాలో జరిగే ప్రవాస భారతీయుల సదస్సులో మాట్లాడుతూ, "మా (భారత్-చైనా) మధ్య సంబంధాలు వివిధ కారణాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయని మీ అందరికి తెలిసిందే" అని జైశంకర్ వెల్లడించారు. 2020కు ముందు, చైనా భారీగా తన బలగాలను ఎల్ఏసీ వెంబడి మోహరించగా, దానికి సమాధానంగా భారత్ కూడా భద్రతా బలగాలను ఉంచిందని ఆయన తెలిపారు.
పశ్చిమాసియాలో సంక్షోభంపై స్పందించిన జై శంకర్
అయితే, ఈ సవాళ్ల కారణంగా ఇతర అంశాలలో కూడా భారత్-చైనా సంబంధాలు ప్రభావితం అయ్యాయని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. బలగాల ఉపసంహరణ అనంతరం ఈ సంబంధాలు ఎలా అభివృద్ధి చెందుతాయో చూడాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం గురించి కూడా జైశంకర్ స్పందించారు. ప్రస్తుతం యుద్ధం విస్తరించకుండా ఉండేందుకు వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయని, ఇరాన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్-రష్యా మధ్య నేరుగా సంబంధాలు లేకపోవడం వల్ల ఈ సంక్షోభం కొనసాగుతుందని వివరించారు. ఈ సమస్యలను తగ్గించేందుకు పలువురు దేశాలు చొరవ చూపుతున్నాయని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల నేతలతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని భాకత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు.