
Airspace: పాకిస్తాన్ విమానాలకు గగనతల నిషేధాన్ని ఆగస్టు 23 వరకు పొడిగింపు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం గగనతలంలో పాకిస్థాన్ ఎయిర్‌లైన్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నిషేధం ఈ నెల 23వ తేదీ వరకూ కొనసాగనుందని అధికారికంగా ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 30న ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి నిరంతరంగా ఈ నిషేధాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. తాజాగా మరల దీన్ని పొడిగించారని, ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఎక్స్ (X) సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
వివరాలు
పాకిస్థాన్ దేశ గగనతలంలో భారతీయ విమానాలకు నిషేధం
ఇక మరోవైపు, పాకిస్థాన్ కూడా భారత విమానాలకు తమ గగనతల వాడకాన్ని అనుమతించకుండా నిషేధాన్ని పొడిగించింది. తమ దేశ గగనతలంలో భారతీయ విమానాలకు నిషేధం ఆగస్టు 24వ తేదీ తెల్లవారుజామున 5:19 గంటల వరకూ కొనసాగుతుందని పాకిస్థాన్ విమానాశ్రయ అథారిటీ స్పష్టం చేసింది. గమనించవలసిన విషయం ఏంటంటే, భారత్ పాకిస్థాన్‌తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ ఏప్రిల్ 24న తమ గగనతలంలో భారత విమానాలకు నిషేధం విధించింది.