Page Loader
Priyanka Chaturvedi: 'భారత్ జి20కి ఆతిథ్యం ఇస్తే, పాక్ టాప్ 20 టెర్రరిస్టులకు ఆతిథ్యం ఇస్తోంది': ప్రియాంక చతుర్వేది
'భారత్ జి20కి ఆతిథ్యం ఇస్తే, పాక్ టాప్ 20 టెర్రరిస్టులకు ఆతిథ్యం ఇస్తోంది': ప్రియాంక చతుర్వేది

Priyanka Chaturvedi: 'భారత్ జి20కి ఆతిథ్యం ఇస్తే, పాక్ టాప్ 20 టెర్రరిస్టులకు ఆతిథ్యం ఇస్తోంది': ప్రియాంక చతుర్వేది

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, పాకిస్థాన్‌పై ఘాటుగా విరుచుకుపడ్డారు. భారత్ గౌరవంగా జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇస్తుంటే, పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయ ఉగ్రవాదులకు శరణాలయంలా మారిందని ఆమె విమర్శించారు. "భారత్ ప్రపంచ దేశాలను సమావేశం చేయడంలో ముందుంటే, పాకిస్తాన్ మాత్రం టాప్ 20 (టీ20) ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది," అంటూ ఆమె కౌంటర్ ఇచ్చారు. 'పాకిస్తాన్‌ బుద్ది ఎలాంటి అంటే.. మనం వారితో కరచాలనం చేసి ఇటు వైపు తిరిగిన వెంటనే.. మన వెనుక నుంచి దాడి చేస్తారు" అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

వివరాలు 

విదేశీ పర్యటనలో పాల్గొన్న ప్రియాంక 

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, పాకిస్తాన్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని అంతర్జాతీయంగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపింది. రవిశంకర్ ప్రసాద్‌ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా ప్రియాంక చతుర్వేది కూడా సభ్యురాలిగా ఉన్నారు. లండన్‌లో ప్రసంగించిన ఆమె మాట్లాడుతూ, భారత్ జీ-20 అధ్యక్షతను సమర్థవంతంగా నిర్వహించిందని, అది గర్వించదగిన విషయమని తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్‌ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ, ప్రస్తుత పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో ప్రియాంక చతుర్వేది, 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ గురించి ప్రస్తావించారు.

వివరాలు 

ఒసామా బిన్ లాడెన్ ఉదాహరణతో పాక్‌పై ముక్తకంఠంగా విమర్శలు 

"ఇక్కడున్నవారిలో ఎంత మందికి లాడెన్ ఎవరో తెలుసు?అతనిపై వచ్చిన డాక్యుమెంటరీలు చూసారా? ఒకసారి అవి చూడండి. పాకిస్తాన్ అతనికి ఎలా ఆశ్రయం ఇచ్చిందో తెలుస్తుంది," అంటూ ఆమె తెలిపారు. ఆమె ఆరోపించిన వివరాల ప్రకారం,పాకిస్తాన్ అల్ ఖైదా ఉగ్ర సంస్థకు నిధులు సమకూర్చినట్లు, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్లు,ఏకంగా లాడెన్‌కు దాక్కోవడానికి చోటు కల్పించినట్లు చెప్పారు. "2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన భారీ ఉగ్రదాడికి బిన్ లాడెన్‌నే ప్రధాన సూత్రధారి. ఆ దాడుల తర్వాత అతను పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడని ప్రపంచం మొత్తానికి తెలిసిందే," అని ఆమె స్పష్టం చేశారు. ఇన్ని విషయాల నేపథ్యంలో, ఇప్పటికైనా పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లండన్‌ పర్యటనలో ప్రియాంక చతుర్వేది