
Trump's tariffs: 'ఇది కదా కౌంటర్ అంటే'.. అమెరికా నుంచి భారత్ ఆయుధాల కొనుగోలు నిలిపివేత!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా సుంకాల విధింపుపై భారత్ దీటైన వ్యూహ రచన దిశగా సాగుతోంది. అమెరికా నుంచి ఆయుధాలు,యుద్ధ విమానాల కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి ఈ విషయాన్ని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ తీసుకొని రాయిటర్స్ కథనం ప్రచురించింది. అంతే కాకుండా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలో అమెరికా పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో సాకుగా చూపుతూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా భారత్ మద్దతిచ్చుతోందని ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఏ వాణిజ్య భాగస్వామిపైనా లేని విధంగా భారత్‌పై ఏకంగా 50 శాతం సుంకాలను విధించారు.
వివరాలు
రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లు
వాణిజ్య ఒప్పందాల్లో పైచేయి సాధించడానికి ట్రంప్ ఈ టారిఫ్ విధిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీ రైతుల హితార్థం కోసమే ఎవరి ఒత్తిళ్ళనైనా తట్టుకుంటామని స్పష్టం చేశారు. అయితే, ఎప్పటి నుంచో రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లు జరుపుతోంది. అయితే, భారతదేశం అమెరికాతో బలమైన సంబంధాలను దృష్టిలో ఉంచుకొని ఆయుధాలు అమెరికా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయుధాల కొనుగోళ్ల విషయాన్ని ప్రకటించారు. కానీ తాజా పరిస్థితుల్లో ఆయుధాల కొనుగోళ్లను నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని రాయిటర్స్ కథనం తెలిపింది.
వివరాలు
భారత రక్షణ మంత్రిత్వ శాఖ లేదా పెంటగాన్ ఎటువంటి స్పందన లేదు
అయితే, ఈ నిలిపివేతకు సంబంధించి ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని ఒక సంబంధిత అధికారి పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడిని ఎదుర్కొనేందుకు భారత్ దీటుగా స్పందించేందుకు ఈ పద్ధతిని సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం భారత రక్షణ మంత్రిత్వ శాఖ లేదా పెంటగాన్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదని రాయిటర్స్ వివరించింది.