LOADING...
Postal Services To US: టారిఫ్‌ల అనిశ్చితి వేళ.. అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత 
టారిఫ్‌ల అనిశ్చితి వేళ.. అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత

Postal Services To US: టారిఫ్‌ల అనిశ్చితి వేళ.. అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 23, 2025
07:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత పోస్టల్ విభాగం తాత్కాలికంగా అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే ఇది శాశ్వతం కాదని,తక్షణమే తిరిగి ప్రారంభించే ప్రణాళిక ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ఈ నెలాఖరులో అమల్లోకి రాబోయే కొత్త కస్టమ్ నిబంధనల కారణంగా తీసుకున్నారని పోస్టల్ విభాగం వివరణ ఇచ్చింది. ఈ సేవలు ఆగస్టు 25 నుండి నిలిచిపోనున్నాయి జులై 30న అమెరికా యంత్రాంగం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం,800 డాలర్ల విలువ ఉన్న వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపులు రద్దు ఉపసంహరించుకుంది. దీని ఫలితంగా, అమెరికాకు పంపే అన్ని పోస్టల్ సరుకులు వాటి విలువకు సంబంధం లేకుండా సుంకాలకు లోబడి ఉంటాయని అధికారులు తెలిపారు.

వివరాలు 

వచ్చే వారం కొత్త టారిఫ్‌లు అమల్లోకి.. 

ఈ పరిణామం నేపథ్యంలోనే ఈ తాత్కాలిక నిలిపివేత నిర్ణయం తీసుకోబడింది. అయితే 100 డాలర్ల వరకు విలువ ఉన్న గిఫ్ట్ ఐటెమ్స్, లేఖలు, ఇతర చిన్న దస్త్రాలకు మాత్రం సుంకాల నుండి మినహాయింపు కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశానికి విధించే సుంకాల పరిమితిని కచ్చితంగా అమలు చేస్తున్నారు. మిత్రదేశం భారత్‌పై కూడా రష్యా చమురు కొనుగోలు చేస్తుందని కారణంగా అదనపు సుంకాలు విధించడం విశేషం. ఆగస్టు 27 నుంచి 50శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వీటి గడువును ట్రంప్‌ పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్‌హౌస్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నరావో ఇప్పటికే పేర్కొన్నారు గతంలో ట్రంప్ ప్రకటించినట్లుగా వచ్చే వారం కొత్త టారిఫ్‌లు అమల్లోకి రావచ్చని సూచించారు.

వివరాలు 

బుకింగ్ పూర్తిచేసినవారికి రీఫండ్ సౌలభ్యం

కానీ, ఈ సుంకాల వసూలు విధానాలకు సంబంధించిన యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (USCBP) వద్ద ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు లేవని విమానయాన, డెలివరీ సంస్థలు తెలిపాయి. ఈ అనిశ్చితి నేపథ్యంలో, ఆగస్టు 25 తర్వాత అమెరికాకు పంపే అన్ని పోస్టల్ కన్‌సైన్‌మెంట్లను స్వీకరించలేమని వారు వెల్లడించారు. ఫలితంగా, భారత్ పోస్టల్ విభాగం (India Post) అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ పార్సెల్ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే బుకింగ్ చేసిన వినియోగదారులు రీఫండ్ పొందే అవకాశం ఉంది. అలాగే, ఈ సేవలను త్వరలో మళ్ళీ ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోస్టల్ విభాగం వెల్లడించింది.