Page Loader
India-Canada: ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేకుందంటూ కెనడా కవ్వింపులు .. తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ
ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేకుందంటూ కెనడా కవ్వింపులు .. తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ

India-Canada: ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేకుందంటూ కెనడా కవ్వింపులు .. తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-కెనడా మధ్య ఉన్న దౌత్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఒట్టావా మరోసారి న్యూదిల్లీపై విమర్శలు చేసింది. కెనడాలోని ఎన్నికలలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుందని ఆరోపణలు చేశాయి. ఈ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. అవి పూర్తిగా తప్పుడు కథనాలేనని పేర్కొంది. కెనడాలో విదేశీ ప్రభుత్వాల జోక్యంపై వచ్చిన ఆరోపణలపై ఆ దేశ ప్రభుత్వం ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో, ''ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేసిన మూడు రాజకీయ పార్టీల నాయకులకు భారత ప్రభుత్వం ప్రాక్సీ ఏజెంట్ల ద్వారా గోప్యంగా ఆర్థికసాయం అందించింది'' అని ఆరోపించింది.

వివరాలు 

భారత దేశపు అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం

ఈ నివేదికపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ''ఎన్నికలలో జోక్యంపై కెనడా మీడియాలో వస్తున్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. వాస్తవానికి, కెనడా భారత దేశపు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. దీని వల్ల మన దేశంలో అక్రమ వలసలు, వ్యవస్థీకృత నేరాలు జరుగుతున్నాయి. కెనడా మీడియా ప్రచురించిన ఆరోపణలతో కూడిన కథనాలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు, అక్రమ వలసలను ప్రోత్సహించే చర్యలు పునరావృతం కాకుండా మనం కృషి చేస్తామని ఆశిస్తున్నాం'' అని విదేశాంగ శాఖ పేర్కొంది.

వివరాలు 

భారత్‌పై నిందలు వేసేందుకు కెనడా ప్రయత్నం 

కాగా.. కెనడా భారత్‌పై ఇలాంటి ఆరోపణలు చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా, పలు సందర్భాల్లో కెనడా భారత్‌పై నిందలు వేసేందుకు ప్రయత్నించింది. 2023 జూన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్యపై కూడా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు, భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు చెప్పడంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు వేడెక్కాయి. ఈ ఆరోపణలను న్యూదిల్లీ తీవ్రంగా ఖండించి, ఆధారాలు అందించేలా కెనడాను కోరింది.