తదుపరి వార్తా కథనం

India-Pakistan: కశ్మీర్‌లో దాయాది ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందే.. పాకిస్థాన్‌కు భారత్ మరోసారి వార్నింగ్
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 25, 2025
08:17 am
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దూషించాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది.
జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir)పై అనవసరమైన ప్రస్తావన తీసుకురావడంపై న్యూఢిల్లీ తీవ్రంగా స్పందించింది.
ఆ ప్రాంతం ఎప్పటికీ భారత్ అంతర్భాగమేనని స్పష్టంగా తెలియజేసింది. అంతేగాక, పాకిస్థాన్ (Pakistan) చట్టవ్యతిరేకంగా ఆక్రమించిన కశ్మీర్ భూభాగాలను వెంటనే ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.
వివరాలు
పాక్ చేసిన ఆరోపణలను ఖండించిన పర్వతనేని హరీశ్
ఐక్యరాజ్యసమితి (United Nations)లో శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి సయ్యద్ తారిఖ్ ఫతేమీ జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
దానిపై భారత్ కఠినంగా స్పందించింది. పాక్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ అనవసరమైన అంశాలను లాగుతోందని మండిపడ్డారు.