India-US trade deal: వచ్చే వారంలో సంయుక్త ప్రకటన,మార్చిలో లీగల్ అగ్రిమెంట్
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 05, 2026
03:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత-అమెరికా మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (FTA) అధికారికంగా అమలుకు రాబోతోంది. ఈ వ్యాపార ఒప్పందం సంబంధంగా వచ్చే వారం రెండు దేశాల నుంచి సంయుక్త ప్రకటన వచ్చే అవకాశం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా తుదిరూపులో సిద్ధం అయ్యిందని ఆయన స్పష్టం చేశారు. ఈ డీల్‌పై సంతకాలు మార్చి మధ్యలో జరగవచ్చని కూడా వెల్లడించారు. దీనితో పాటు, భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అమెరికా అంగీకరించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సోషల్ మీడియా పోస్టులో ఎఫ్‌టీఏ ప్రస్తావన కనిపించలేదు. ఈ నేపధ్యంలో కేంద్రం నుంచి స్పష్టమైన సమాచారం వెలువడింది.