తదుపరి వార్తా కథనం

Srinagar Airport: శ్రీనగర్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా డ్రోన్ దాడికి యత్నం.. అడ్డుకున్న భారత సైన్యం
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 09, 2025
11:07 pm
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్, జమ్ముకశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి జమ్మూ విమానాశ్రయంపై దాడి చేయాలని పాక్ సైన్యం గట్టిగా యత్నించగా, భారత భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరించి ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా భగ్నం చేశాయి.
తాజాగా శుక్రవారం పాక్ మరోసారి శ్రీనగర్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుంది.
పాక్ డ్రోన్లు అక్కడికి చేరేందుకు ప్రయత్నించగా, వెంటనే భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసి వాటిని అడ్డుకున్నారు.
వరుసగా పెరుగుతున్న ఈ డ్రోన్ దాడుల నేపథ్యంలో భారత భద్రతా వ్యవస్థ మరింత కట్టుదిట్టంగా పనిచేస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దాడిని అడ్డుకున్న భారత సైన్యం
Suspected drone attack on Srinagar airport, countermeasures activated: Officials
— Press Trust of India (@PTI_News) May 9, 2025