
SCO Meeting: పాక్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన.. ప్రధానితో విందుకు ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్థాన్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆయన రెండు రోజుల పాటు జరిగే షాంఘై సహకార సంఘం వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఇచ్చే డిన్నర్ వేడుకలో జైశంకర్ పాల్గొనే అవకాశం ఉంది.
ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. జైశంకర్ మంగళవారం ఇస్లామాబాద్ చేరుకుని, అక్కడ 24 గంటల కన్నా తక్కువ సమయం గడపనున్నారు.
ఈ సమావేశానికి చైనా, రష్యా ప్రధానులు కూడా హాజరుకానున్నారు. ఇందులో భాగంగా చైనా ప్రధాని ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నారు.
Details
9ఏళ్ల తర్వాత మొదటిసారి
ఈ ఏడాది ఎస్‌సీవో సదస్సు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత్ కూడా ఆహ్వానం అందుకుంది.
అయితే, పాకిస్థాన్‌తో ఎటువంటి ద్వైపాక్షిక చర్చలు జరగవని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా పాకిస్థాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
2015 డిసెంబర్‌లో, నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అఫ్గాన్‌పై నిర్వహించిన ఓ సదస్సు సందర్భంలో పాకిస్థాన్‌ను సందర్శించారు.
9 సంవత్సరాల తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.