
చైనా,పాకిస్థాన్‌లతో వ్యాపారంపై భారత్ ఆంక్షలు.. తమకు తెలియకుండా ఎలాంటి వాణిజ్యం చేయకూడదని రాష్ట్రాలకు ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ లతో వ్యాపార సంబంధాలపై నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
నిర్దిష్ట దేశాల పేరు పెట్టకుండానే, జూలై 23, 2020న భారతదేశంతో భూ సరిహద్దులను పంచుకునే దేశాల్లోని కంపెనీల నుంచి పబ్లిక్ ప్రాజెక్ట్‌ల కొనుగోళ్లను పరిమితం చేసింది.
మరోవైపు చైనా, పాకిస్థాన్ లాంటి శత్రు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న దేశీయ, విదేశీ కార్పొరేట్ సంస్థలు ప్రత్యక్షంగా భాగస్వామ్యాన్ని కేంద్రం నియంత్రిస్తోంది. ఫలితంగా కేంద్రం ఆర్థిక భద్రతా నిబంధనలను కఠినతరం చేసింది.
అంతేకాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
DETAILS
వ్యూహాత్మక రంగాల్లో చైనా భాగస్వామ్యంపై నియంత్రణ
భారత ప్రభుత్వానికి తెలియకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా శత్రు దేశాలతో గానీ భారత్ తో సరిహద్దును పంచుకునే దేశాలతో కానీ వాణిజ్య సంబంధాలు నెరిపినా అవి కేంద్రం పరిధిలోకి లోబడే ఉంటాయని స్పష్టం చేసింది.
భద్రతా సమస్యల్లో పెరుగుదల కనిపిస్తున్న కారణంగా శత్రుదేశాలు,పొరుగు దేశాలతో వ్యాపార సంబంధాలను కలిగి ఉండాలంటే ముందస్తుగా కేంద్రం ఆమోదం పొందాలని ఆదేశించింది.
మౌలిక సదుపాయల ప్రాజెక్ట్‌ల్లో చైనా కాంట్రాక్టర్లను భాగం చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రైవేట్ సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది.
అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లోని ఉగ్రదాడికి ముందు భద్రతాపరమైన పరిణామాలపై కేంద్రానికి విశ్వాసనీయమైన సమాచారం అందింది.
విద్యుత్, పెట్రోలియం,బొగ్గు, టెలికాం లాంటి వ్యూహాత్మక రంగాల్లో చైనా భాగస్వామ్యాన్ని తాజా ఆదేశం నియంత్రిస్తుంది.