NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పేలుళ్ల కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు 
    తదుపరి వార్తా కథనం
    పేలుళ్ల కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు 
    పేలుళ్ల కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు

    పేలుళ్ల కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 13, 2023
    01:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో నలుగురు ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు శిక్ష పడింది. ఈ మేరకు దిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.

    హైదరాబాద్, డిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ఈ నిందితులు రెక్కీ నిర్వహించారని జాతీయ దర్యాప్తు సంస్థ చేసిన వాదనలతో సదరు కోర్టు ఏకీభవించింది. ముఖ్యంగా పేలుళ్ల కోసం నిందితులు ఆయుధాలను సైతం సమకూర్చుకున్నారని దర్యాప్తు సంస్థ స్ఫష్టం చేసింది.

    హైదరాబాద్ కు చెందిన ఒబేద్ రహమాన్, బీహార్‌కు చెందిన ధనిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్ లను 2013లో ఎన్ఐఏ అరెస్టు చేసింది.

    వారిని జులై 7వ తేదీని దోషులుగా నిర్ధారించిన ఎన్ఐఎ కోర్టు నేడు శిక్ష విధించింది.

    Details

    జైలు శిక్షతో పాటు జరిమానా విధింపు

    2007లో జరిగిన గోకుల్ చాట్, లుంబినీపార్కు జంటపేలుళ్లు, 2013లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లలో వీరి పాత్ర ఉందని ఛార్జ్‌షీట్‌లో తెలిపింది.

    అంతే కాకుండా గతంలో వారణాసి, ముంబై, ఫజియాబాద్, డిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరులో జరిగిన పేలుళ్లలోనూ ఈ నలుగురి పాత్ర ఉందని పేర్కొంది.

    ఈ కేసులలో 11 మందిని నిందితులను జాతీయదర్యాప్తు సంస్థ చేర్చింది. మిగతా ఏడుగురు నిందితుల్లో యాసిన్ బత్కల్, అక్తర్, రెహమాన్, తెహసిన్అక్తర్, హైదర్అలీ, రియాజ్ బత్కల్‌తో పాటు మరో నిందితుడు ఉన్నాడు.

    ప్రస్తుతం జైల్లో ఉన్న ఐదుగురు నిందితులపై విచారణ కొనసాగుతోంది. ఆ నలుగురికి జైలు శిక్షతో పాటు డానిష్ అన్సారీకి రూ. 2,000, అఫ్తాబ్ ఆలమ్‌కు రూ. 10,000 జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్ఐఏ
    దిల్లీ

    తాజా

    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్

    ఎన్ఐఏ

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ముంబై
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు కర్ణాటక
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు హర్యానా
    టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు జమ్ముకశ్మీర్

    దిల్లీ

    రూ.2 కోట్లు ఇవ్వకుంటే నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్  ప్రధాన మంత్రి
    సాంకేతిక లోపంతో దిల్లీలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ విమానాశ్రయం
    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    నేడు దిల్లీకి మంత్రి కేటీఆర్.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం అమిత్ షాతో కీలక భేటీ  కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025