Indian Railways- highest Record-Trips: ఏప్రిల్‌లో అత్యధిక ప్రయాణీకుల సంఖ్యను నమోదు చేసిన భారతీయ రైల్వే
భారతీయ రైల్వే (Inian Railway) ఏప్రిల్ నెలలో అత్యధిక ప్రయాణికుల సంఖ్య (Highest Record)ను నమోదు చేసింది. రికార్డు స్థాయిలో 411 మిలియన్ల మంది గడిచిన మూడు వారాలలో రైలు (Trains)లో ప్రయాణించినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. వేసవి సెలవులు (Summer Holidays), వివాహాలు (Wedding),ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికలు (Elections) నేపథ్యంలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు రైలు ద్వారా ప్రయాణించినట్లు తాజా ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ తొలి మూడు వారాలలో ఇంత రికార్డు స్థాయిలో రైల్వేలో ప్రయాణించడం ఇదే తొలిసారి. ప్రయాణికుల (Passengers) రద్దీ దృష్ట్యా పశ్చిమ రైల్వే (Westren Railway) అత్యధికంగా 1,878 ట్రిప్పులను నడిపింది.
రికార్డు స్థాయిలో అదనపు ట్రిప్పులు
తర్వాత నార్త్ వెస్ట్రన్ (North Westren Railway) రైల్వే 1,623 ట్రిప్పులను, దక్షిణ మధ్య రైల్వే (South central Railway) 1,012 ట్రిప్పులను, తూర్పు మధ్య రైల్వే (East central Railway) 1,003 ట్రిప్పులను నడిపాయి. సుమారు 370 మిలియన్ ప్యాసింజర్లను ఈ రైళ్లు వారి గమ్యస్థానాలకు చేర్చాయి. గత ఏడాది ఇదే సమయంలో 350 మిలియన్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశాయి. కోవిడ్ అనంతర పరిణామాల తర్వాత ఇంత భారీ స్థాయిలో ప్రయాణికులు రైలులో ప్రయాణించడం ఇదే తొలిసారి. ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు భారతీయ రైల్వే సుమారు 411.6 మిలియన్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసింది.
కిక్కిరిసిపోయిన రైళ్లు
ఏప్రిల్ 20, 21 రెండు రోజుల లోనే 33.8 మిలియన్ల మంది రైళ్లలో ప్రయాణించారు. రద్దీ పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ లన్నీ కిక్కిరిసిపోయాయి. ఢిల్లీ, పాట్నా,కోల్ కతా, దర్భంగా రైల్వే రూట్ లన్నీ బిజీగా మారిపోయాయి. రైళ్లన్నీ కిటకిటలాడిపోయాయి. కొన్ని రైళ్లలో ప్రయాణికులు నిలబడే ప్రయాణాలు చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రిజర్వేషన్ లేని ప్రయాణికులు కూడా రిజర్వుడు బోగీల్లోకి చొరబడి ప్రయాణించారు. కొంతమంది భోగి లోని డోర్ల వద్దే నిలబడి ప్రయాణాలు చేశారు. ఎన్నికల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే 43% అదనపు సర్వీసులను పెంచింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఇండియన్ రైల్వే రికార్డు స్థాయిలో 9,111 రైలు సర్వీసులను ఈ వేసవికాలంలో నడుపుతోంది.