
Nepal: నేపాల్‌లో చిక్కుకున్న భారతీయ టూరిస్టు.. కర్రలతో వెంటబడ్డారని ఆవేదన
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో జెన్ Z తరగతికి చెందిన ఆందోళనకారుల ఆందోళనలు అనేక హింసాత్మక సంఘటనలకు దారి తీస్తున్నాయి. నిరసనలు పెరిగిపోయి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు నాశనం చేశారు. ముఖ్యంగా పోఖారా ప్రాంతంలోని ఓ హోటల్‌పై కూడా ఆందోళనకారులు దాడి చేసి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. అయితే అందులో ఉన్న ఉపాసన గిల్ అనే భారత పర్యాటకురాలు తనకు సాయం చేయాలంటూ ఓ వీడియో విడుదల చేశారు '' నాపేరు ఉపాసన గిల్. వాలీబాల్ లీగ్ కోసం నేపాల్‌కి వచ్చాను. ఇక్కడ నిరసనలు,ఆందోళనలు జరగడంతో పోఖారాలోని హోటల్‌లో చిక్కుకున్నాను.
వివరాలు
పర్యాటకులను కూడా వాళ్లు వదలిపెట్టడం లేదని.. గిల్ ఆవేదన
ముందుగా నేను బస చేసిన హోటల్‌కు జెన్ Z ఆందోళనకారులు నిప్పంటించారు. నా వస్తువులు హోటల్ లోనే ఉన్నాయి. దాడి జరిగిన సమయంలో నేను స్పాలో ఉన్నాను. కొంతమంది నిరసనకారులు పెద్ద కర్రలతో నాపైకి దూసుకొచ్చారని'' గిల్ ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ల నుంచి తప్పించుకున్నానని.. తనకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం అక్కడ ఎక్కడా చూసినా రోడ్లపై మంటలే కనిపిస్తున్నాయని తెలిపింది. పర్యాటకులను కూడా వాళ్లు వదలిపెట్టడం లేదని.. అన్నింటిని తగలబెడుతున్నారని వాపోయింది. ఈ నేపథ్యంలో, నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల సురక్షిత రవాణాకై భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.
వివరాలు
హెల్ప్‌లైన్ నంబర్ల విడుదల
ఖాట్మండులోని భారతీయ రాయబారి కార్యాలయం విపత్కర పరిస్థితుల్లో సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. +977 - 980 860 2881,+977 - 981 032 6134 ఈ నంబర్లకు సాధారణ కాల్స్,వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా సంప్రదించవచ్చని సూచన ఇచ్చింది. అక్కడ పరిస్థితులు స్థిరంగా మారే వరకు అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని,వీధుల్లోకి వెళ్లవద్దని,స్థానిక అధికారులు ఇచ్చే సూచనలు తప్పకుండా అనుసరించాలని సూచించింది. అంతేకాక,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడ చిక్కుకుపోవడంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్,ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాట్లు చేశారు. అవసరమైతే +91 9818395787 +91 8500027678, helpline@apnrts.com,info@apnrts.com ఈ నంబర్లు, ఇమెయిల్ ద్వారా సహాయం కోసం సంప్రదించవచ్చని స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నేపాల్ నుండి ఉపాసన గిల్ అనే భారత పర్యాటకురాలు విడుదల చేసిన వీడియో
Amid growing unrest against corruption in Nepal, this woman urged the Indian embassy in aiding for her rescue from the country. pic.twitter.com/0CpePt3v9X
— Brut India (@BrutIndia) September 10, 2025