Page Loader
పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు
ఆన్లైన్లో పెళ్లి చేసుకున్న ఇండో పాక్ వధువరులు

పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 06, 2023
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ అమ్మాయి, భారత అబ్బాయి శనివారం ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో అమీనా, అర్బాజ్ ఖాన్ జంట పెళ్లి పీటలెక్కింది. అయితే వీరి వివాహం భారత్‌లోనే జరగాల్సి ఉంది. కానీ వధువు అమీనాకు భారత్ వచ్చేందుకు వీసా దొరకలేదు. దీంతో ఎవరి దేశాల్లో వారు ఉండిపోయారు. ఈ క్రమంలోనే వివాహాన్ని వర్చువల్ పద్ధతిలో జరిపించారు. అయితే వీరి వివాహం ఇరు కుటుంబాల ఇష్టపూర్వకంగానే జరిగినట్లు వరుడు వెల్లడించారు. పాక్‌లోని తమ బంధువులే ఈ సంబంధాన్ని కుదిర్చినట్లు అర్బాజ్ ఖాన్ చెప్పుకొచ్చారు. భారత్ -పాక్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నందున వివాహం ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి వచ్చిందని ఖాన్ అన్నారు.

details

వీసా వచ్చాక మరోసారి ఇండియాలో పెళ్లి

త్వరలోనే అమీనాకు వీసా వస్తుందని, ఆ తర్వాత ఇండియాలో మరోసారి వివాహం చేసుకుంటామని అర్భజ్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ మధ్యే పాక్ సీమా హైదర్, ఇండియాకు చెందిన సచిన్ మీనా దంపతులుగా మారారు. మరోవైపు అంజు, నస్రుల్లాలు సైతం అంతర్జాతీయ సరిహద్దులను చెరిపేసుకుని తమ ప్రేమను సార్థకం చేసుకున్నారు. ఇప్పుడు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అర్బాజ్ ఖాన్ వివాహం పాక్ యువతి అమీనాతో జరిగింది. గతకొంత కాలంగా ఇండో- పాక్ మ్యారేజ్ రిలేషన్స్ ఇటీవలే బాగా పాపులర్ అవుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా ప్రజల మధ్య మాత్రం బలమైన బంధాలు పెనవేసుకుంటున్నాయి.