Madhya Pradesh: ఇండోర్‌లో 21 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని తన హాస్టల్ గదిలో 21 ఏళ్ల విద్యార్థి పునీత్ దూబే శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక పోలీసులు అందించిన వివరాల ప్రకారం, దూబే, రంజిత్ సింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం B.Sc.చదువుతున్నాడు. దాంతో పాటు మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (MPPSC) పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అయితే తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కళ్లకు గంతలు కట్టుకుని, చీర, మహిళల అలంకరణలో కనిపించాడు.
కొనసాగుతున్న విచారణ
పునీత్ దూబే అనుమానాస్పద మృతిపై విచారణ జరుగుతోందని స్థానిక పోలీసులు తెలిపారు. అతని మృతదేహానికి సమీపంలో నేలపై రక్తపు మడుగు కనిపించింది. దీంతో పోలీసులు దూబే మరణాన్ని ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అతని గది నుండి దుర్వాసన వెలువడుతున్నట్లు ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల అనంతరం అనుమానాస్పద స్ధితిలో పునీత్ దూబే మృతదేహం కనుగొన్నారు. ఉదయపురా నివాసి , స్థానిక రైతు నాయకుడు త్రిభువన్ కుమారుడు దూబే. తన కొడుకు చదువు కోసం రెండేళ్ల క్రితం ఇండోర్‌కు వెళ్లి , కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడని చెప్పారు.
దూబే నుంచి ఇంటికి కాల్ రాకపోవడంతో ఆందోళన
పునీత్ దూబే ప్రతిరోజూ రాత్రి ఇంటికి ఫోన్ చేసేవాడని, గురువారం రాత్రి 10:00 గంటలకు తన తల్లితో చివరి సంభాషణ అని త్రిభువన్ వెల్లడించారు. కోచింగ్ సెంటర్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పునీత్ ఉండేవాడని త్రిభువన్ పోలీసులకు తెలిపాడు. రోజంతా పునీత్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై శుక్రవారం పోలీసులను అప్రమత్తం చేశారు.