Page Loader
బిపర్‌జోయ్ తుపాను; గుజరాత్ లోని 9 నగరాలకు రాకపోకలు బంద్ 
9 నగరాల్లో రాకపోకలు నిలిపివేత

బిపర్‌జోయ్ తుపాను; గుజరాత్ లోని 9 నగరాలకు రాకపోకలు బంద్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 14, 2023
09:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిపర్‌జాయ్ తుపాను కల్లోలంగా మారుతుండగా తీర ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మురంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. తుపాను ధాటికి ముందస్తుగా తొమ్మిది నగరాలను పూర్తిగా మూసివేశారు. సౌరాష్ట్ర-కచ్ సహా వివిధ తీర ప్రాంతాల్లో తీవ్ర గాలులతో అతిభారీ వర్షం కురుస్తోంది. గురువారం ద్వారకలోని ద్వారకాదీశ్ అలయాన్ని సైతం మూసివేసేందుకు ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం త్రివిధ దళాధిపతులతో పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గుజరాత్ లో భారీ వర్షాల నేపథ్యంలో సహాయచర్యల కోసం అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లను ఆదేశించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

త్రివిధ దళాధిపతుల సమీక్ష పై మంత్రి ట్వీట్