Page Loader
Jharkhand: పరీక్షల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేత 
పరీక్షల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేత

Jharkhand: పరీక్షల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2024
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే శని, ఆదివారాల్లో రాష్ట్రంలో జనరల్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ కంబైన్డ్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌ (JGLCCE) లో పరీక్షలు జరగనున్నాయి. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 823 కేంద్రాల్లో నిర్వహించనుండగా, దాదాపు 6.39 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని అధికారులు తెలిపారు.

Details

పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి 

శని, ఆదివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరుగుతుంది. ఈ సమయంలోనే మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయనున్నారు. ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తెలిపారు. పరీక్షల సమయంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.