Revanth Reddy: ఫోన్ల టాపింగ్ కేసు విచారణ కొనసాగుతుంది : రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ లో చెప్పారు. మీడియాతో కాసేపు పిచ్చా పాటీ మాట్లాడారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు డిమాండ్ చేసినట్లుగా సిబిఐ కూడా విచారణ జరుపుతుందన్నారు. బిఆర్ఎస్ హాయంలో పలువురి ఫోన్లు టాపింగ్ చేేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ,అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిపై నిఘా జరిగింది. విచారణ సందర్భంగా మాజీ DCP రాధాకిషన్ రావు వాంగ్మూలంలో మరిన్ని కీలక విషయాలను వెల్లడించారు.
పలు మీడియా సంస్థల యజమానుల ఫోన్లు ట్యాప్
బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారిన వ్యక్తులపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, RS ప్రవీణ్ కుమార్, శంభీపూర్ రాజు, రఘువీర్ రెడ్డి, ఈటల, బండి సంజయ్, అరవింద్, పలు మీడియా సంస్థల యజమానుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్, BJPకి ధన సహాయం చేసేవారిపై ఎక్కువగా నిఘా పెట్టారని వాంగ్మూలంలో పేర్కొన్నారు