Page Loader
PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌
ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌

PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎస్ అధికారి,ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ శాఖకు మాజీ డైరెక్టర్‌గా పనిచేసిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను రాష్ట్ర సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ముంబయికి చెందిన నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆయనపై నమోదైన ఆరోపణలకు సంబంధించి,హైదరాబాద్‌లో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కీలక భాద్యతలు నిర్వహించారు. ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, విశ్వసనీయ అధికారిగా పేరొందారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. సీఐడీ అధికారులు ఆయన్ను హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలించేందుకు చర్యలు చేపట్టారు. జెత్వానీ వేధింపుల కేసును సమగ్రంగా విచారించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్