Rahul Gandhi: 2014, 2024 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాహుల్ సంచలన ఆరోపణలు!
ఈ వార్తాకథనం ఏంటి
రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పదేళ్లుగా ఫాసిస్టుల గొంతు గట్టిగా వినిపిస్తోందని, వారి వల్ల దేశంలోని వ్యవస్థలు ధ్వంసమవుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమిట్ (Bharat Summit)లో ఆయన ప్రసంగించారు.
వివరాలు
2014, 2024 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి
2014లో జరిగిన ఎన్నికలు గతంలో ఎప్పుడూ చూడని విధంగా సాగాయి. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ ఎన్నికల్లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ధ్వంసమైంది.
2024సార్వత్రిక ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకుంది.
కానీ ఆ తర్వాత మూడు నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఆ ఎన్నికల్లోనూ అనేక అవకతవకలకు పాల్పడ్డారు.
కేవలం మూడు నెలల వ్యవధిలోనే 70లక్షలకు పైగా ఓట్లు నమోదు చేశారు. అదనంగా చేర్చిన ఓట్ల కారణంగానే భాజపా విజయం సాధించింది.
వ్యవస్థలు నాశనమవుతున్నా.. మనం ప్రజాస్వామ్యమని గొప్పగా చెప్పుకొంటున్నాం. రాజకీయాలంటే గట్టిగా మాట్లాడటం, ఘాటైన విమర్శలు చేయడం మాత్రమే కాదు'' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
వివరాలు
అదానీ వ్యాపారంపై రాహుల్ విమర్శలు
హైదరాబాద్, బెంగళూరులో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని రాహుల్ పేర్కొన్నారు. అదానీ వ్యాపార విస్తరణను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
''12ఏళ్ల క్రితం 600వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మోదీ అధికారంలోకి వచ్చాక సంపన్నుల జాబితాలో అదానీ రెండో స్థానానికి చేరుకున్నారు. ఏ రంగంలో చూసినా అదానీ పెట్టుబడులే కనిపిస్తున్నాయి.
మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వ్యాపారం బాగా విస్తరించింది. పోర్టులు, విమానాశ్రయాలు, మౌలిక వసతులు.. ఇలా అన్నీ అదానీకి అప్పగించారు.
లబ్ధి పొందిన వ్యాపారులు వ్యవస్థలను తమకు అనుకూలంగా మేనేజ్ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఈ భారత్ సమిట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.