Page Loader
బీజేపీతో జనసేన తెగదెంపులు చేసుకున్నట్లేనా..? పవన్ కళ్యాణ్ చెప్పింది అదేనా..?
బీజేపీతో జనసేన తెగదెంపులు చేసుకున్నట్లేనా..? పవన్ కళ్యాణ్ చెప్పింది అదేనా..?

బీజేపీతో జనసేన తెగదెంపులు చేసుకున్నట్లేనా..? పవన్ కళ్యాణ్ చెప్పింది అదేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2023
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ మొదట్నించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. వ్యూహాత్మకంగానే బీజేపీ విషయంలో పవన్ కళ్యాణ్ తన వైఖరిని మార్చుకొని ఏన్డీఏ నుంచి బయటికొస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఏన్డీఏ నుంచి బయటకొచ్చినట్లుగా పవన్ కళ్యాన్ పెడనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను సంచలనం అవుతున్నాయి. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ అధికారికంగా ఏన్డీఏలో ఉన్నారా.. బయటికొచ్చారా అన్నది ప్రకటిస్తే మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.

Details

బీజేపీ విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఓ స్టాండ్ తీసుకొనే అవకాశం

బీజేపీ ఎత్తుగడలను నమ్ముకుంటే జనసేన ఉనికికే ప్రమాదమని పవన్ ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. గతంలో తెలంగాణలో బీజేపీతో పొత్తు లేదని దిల్లీలో చంద్రబాబు ప్రకటించారు. ఏపీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీ అనుభవం-జనసేన పోరాట పటిమ రెండూ కలిస్తే వైసీపీని ఓడించవచ్చని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అంటే టీడీపీకు మద్దతిచ్చేందుకు ఎన్డీయేలోంచి బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఓ స్టాండ్ తీసుకొనే అవకాశం ఉంటుంది. మరోవైపు వైసీపీతో బీజేపీ సఖ్యతగా ఉన్నంతకాలం ఆ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం ఉండదని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారట. జనసేన, టీడీపీ నిర్ణయం తర్వాత బీజేపీ విషయంలో ఏపీ రాజకీయాల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.