Page Loader
Srinagar: టూరిజం కార్యాలయం సమీపంలో గ్రెనేడ్‌తో ఉగ్రవాదులు దాడి.. 10 మందికి గాయలు 
టూరిజం కార్యాలయం సమీపంలో గ్రెనేడ్‌తో ఉగ్రవాదులు దాడి.. 10 మందికి గాయలు

Srinagar: టూరిజం కార్యాలయం సమీపంలో గ్రెనేడ్‌తో ఉగ్రవాదులు దాడి.. 10 మందికి గాయలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2024
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌, శ్రీనగర్‌లోని ఫ్లీ మార్కెట్‌లో ఉన్న పర్యాటక శాఖ రిసెప్షన్ సెంటర్ (టిఆర్‌సి)పై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. రద్దీగా ఉండే మార్కెట్‌లో చాలా మంది పౌరులు ఉన్న సమయంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు క్షతగాత్రులను శ్రీ మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.

వివరాలు 

మార్కెట్‌లో రద్దీ పెరగడంతో దాడికి పాల్పడిన  ఉగ్రవాదులు 

జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫ్లీ మార్కెట్‌లో మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. అదే సమయంలో టిఆర్‌సి సమీపంలో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరి పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం పారామిలటరీ బలగాలతో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఖన్యార్ ప్రాంతంలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన పాక్ టాప్ కమాండర్ హతమైన తర్వాత ఈ దాడి జరిగింది.

వివరాలు 

దాడి తర్వాత ఆ ప్రాంతంలో భయాందోళనలు 

ఉగ్రవాదుల దాడితో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పేలుడు శబ్దం రావడంతో దుకాణదారులు దుకాణాలు వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అనంతరం పోలీసులు, భద్రతా బలగాలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో యాంటీ టెర్రరిజం ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా బలగాల దృష్టి మరల్చేందుకు ఉగ్రవాదులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దాడి ఆందోళనకరం: ముఖ్యమంత్రి అబ్దుల్లా