
YSRCP: వైస్సార్సీపీకి మరో షాక్.. ఈనెల 22న జనసేనలోకి ఉదయభాను
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ పార్టీకి వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి.
గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పని చేసిన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
తాజాగా, నిన్నటి రోజు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పాగా, ఇవాళ మరో నేత అదే బాటను అనుసరించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు.
ఆయన వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. సామినేని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలసి, జనసేనలో చేరుతానని స్పష్టంగా తెలిపారు.
శుక్రవారం వైసీపీకి తన రాజీనామాను సమర్పించిన సామినేని, ఆదివారం రోజున జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు.
వివరాలు
ఐద్దు సార్లు ప్రభుత్వ విప్‌గా సామినేని
తొలుత పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు చెప్పిన ఆయన, సమావేశం అనంతరం బయటకు వచ్చి, రాజీనామా, పార్టీ మార్పు విషయాలను మీడియాకు వెల్లడించారు.
అటు, ఎలాంటి షరతులు లేకుండా జనసేనలో చేరతానని స్పష్టం చేశారు.ఈ ఉదయం జగ్గయ్యపేట నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమైన సామినేని,పార్టీ మార్పు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సామినేని,మూడు సార్లు విజయం సాధించారు.ఐద్దు సార్లు ప్రభుత్వ విప్‌గా కూడా సేవలు అందించారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన, 1999, 2004ల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
2009, 2014 ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయాన్ని సాధించారు.