Page Loader
ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు; నలుగురు జవాన్లు మృతి 
ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు; నలుగురు జవాన్లు మృతి

ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు; నలుగురు జవాన్లు మృతి 

వ్రాసిన వారు Stalin
Apr 20, 2023
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో గురువారం ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకొని నలుగురు జవాన్లు అక్కడిక్కకడే మృతి చెందారు. ఈ ఘటన భాటా ధురియన్ ప్రాంతానికి సమీపంలో జరిగింది. పిడుగుపాటు కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పూంచ్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘటనా స్థలానికి విషయం తెలిసిన వెంటనే ఆర్మీ అధికారులు, పోలీసులు చేరుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వాహనంలో చెలరేగుతున్న మంటలు