
సీఎం కోసం కొబ్బరి చెట్లు నరకడంపై పవన్ చురకలు.. పుష్ప విలాపం చదవకపోతే ఇలాగే ఉంటుందని ఎద్దేవా
ఈ వార్తాకథనం ఏంటి
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలను ఎక్కుపెట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 26న సీఎం పర్యటించనున్నారు.
సీఎం హెలికాప్టర్ దిగేందుకు ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ వద్ద ఖాళీ స్థలంలో చెట్లను నరికి హెలిప్యాడ్ రెడీ చేస్తున్నారు.ఈ సందర్భంగా వైసీపీ పాలనలో చెట్లు కూడా విలపిస్తున్నాయని పవన్ అన్నారు.
తమిళనాడులో చెట్లను కుటుంబీకులుగా చూసుకుంటారన్నారు.ఏపీలో ఆస్తులు కూడబెట్టుకోవాలనుకునే వాళ్లు ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఈ మేరకు వృక్షో రక్షతి రక్షితః అంటూ జనసేనాని ట్వీట్ చేశారు.
జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం చదవకపోతే, చంద్రబోస్ ప్రయోగాలు అర్థంచేసుకోలేనపుడు మొక్కలు,చెట్లకు గాయం చేస్తే ఎలా ఉంటుందో వీటిని చూస్తే తెలుస్తుందని చురకలు అంటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వృక్షో రక్షతి రక్షితః అంటూ జనసేనాని ట్వీట్
వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి..
— Pawan Kalyan (@PawanKalyan) July 24, 2023
An unprecedented procedure to cut trees while AP CM travels.
These photos are from Amalapuram.
When you don’t read ‘Pushpa Vilapam’ by Sri Jandyala Papayya Sastry’, When you don’t understand Jagadeesh chandrabose experiments ,how… pic.twitter.com/z7Qjv6f6ov
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైసీపీ సర్కారు తీరుపై పవన్ చురకలు
వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి..
— Pawan Kalyan (@PawanKalyan) July 24, 2023
కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలి.… pic.twitter.com/tLHGWn3FU2