Page Loader
పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఒక్కరోజు ముందే మంగళగిరిలో హోమం
పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఒక్కరోజు ముందే మంగళగిరిలో హోమం

పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఒక్కరోజు ముందే మంగళగిరిలో హోమం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 09, 2023
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాలనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మరో 4 రోజుల్లో ఈ యాత్రను ప్రారంభించనున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ప్రారంభానికి ఒక్క రోజు ముందు హోమం చేయనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఈ నెల 14న ముహుర్తం ఖరారైన సంగతి విదితమే. అయితే తన యాత్రకు దైవ బలాన్ని తోడు చేసుకునేందుకు హోమం చేయాలని పవన్ ముందుగానే సంకల్పించారు. ఇందులో భాగంగా జూన్ 13న మంగళగిరి జనసేన ఆఫీసులో హోమం చేయనున్నారు.

Details

తూర్పు గోదావరి పర్యటన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంట్రీ

వారాహి యాత్రకు సంబంధించిన పోస్టర్ ను పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ గత సోమవారం రిలీజ్ చేశారు. తొలి విడద యాత్రలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన సాగించనున్నారు. ఈ క్రమంలోనే తొలుత తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఈ మేరకు పిఠాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ అర్బన్ , కాకినాడ రూరల్, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగిపోనుంది. తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోకి పవన్ కళ్యాణ్ ప్రవేశించనున్నారు.