
Pawan Kalyan: బోటు ప్రమాద బాధితులకు జనసేన ఆర్థిక సాయం
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖ పట్టణం షిప్పింగ్ హర్బర్‌లో బోట్ల దగ్ధం ప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించాడు. బాధితులను ఆదుకుంటామని ఆయన చెప్పారు.
జనసేన (Jana Sena) పార్టీ తరుపున నుండి ఏబై వేల రూపాయాలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
రానున్న రెండు మూడ్రోజుల్లో తానే స్వయంగా వచ్చి పరిహారం అందజేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు.
విశాఖ షిప్పింగ్ హర్బ్‌ర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో సూమారు 40 బోట్లు దగ్ధం కాగా, మరో 60 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ఒక్కో బోటు విలువ సూమారు 20 నుండి 30 లక్షలు ఉండనుంది. ఆదివారం రాత్రి ఈ ఆగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
Details
మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు
మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
ఇక రుషికొండపై నిర్మిస్తున్న రాజ మహల్ కోసం చేస్తున్న ఖర్చుతో విశాఖలో ఒక హార్బర్, ఏడు జెట్టీలు నిర్మించవచ్చని చెప్పారు.
కొందరు బోట్లను దగ్ధం చేశారనే అనుమానాలను మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఒక్కో బోటు విలువను 80శాతం లెక్కగట్టి మత్స్యకారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.