
India-Pakistan: : నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం పాక్ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలో నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకు గురయ్యాయి.
ఈ మెరుపు దాడుల అనంతరం సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ రేంజర్లు విచక్షణ లేకుండా కాల్పులు జరుపుతుండటం గమనార్హం.
గురువారం రోజూ పాక్ సైన్యం కవ్వింపులను కొనసాగించినట్టు సమాచారం.
కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో ఉన్న సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ బలగాలు మోర్టార్లతో షెల్లింగ్, తుపాకులతో కాల్పులు జరుపుతున్నాయి.
ఈ దాడులకు భారత సైన్యం సమర్థంగా ప్రతిస్పందిస్తూ ఎదురు కాల్పులు చేస్తోంది.
పాకిస్తాన్ సైన్యం ప్రత్యేకంగా నివాస ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతుండటంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురై సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
వివరాలు
దాడుల్లో 13మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు
ఇదిలాఉండగా, బుధవారం అర్ధరాత్రి పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాను వీరమరణం పొందినట్లు సమాచారం.
పాక్ షెల్లింగ్‌లో గాయపడి 5వ ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేశ్‌కుమార్ ప్రాణాలు కోల్పోయినట్టు వైట్ నైట్ కోర్ అధికారికంగా ధృవీకరించింది.
మరోవైపు, మంగళవారం అర్ధరాత్రి నుంచి పూంఛ్,తంగ్ధర్ సెక్టార్లలో పాక్ బలగాలు కాల్పులను కొనసాగించాయి.
ఈ దాడుల్లో 13మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు.గాయపడిన వారి సంఖ్య 57గా ఉండగా, మృతులలో నలుగురు చిన్నారులూ ఉన్నారు.
పహల్గాం దాడి తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మిగిలేలా కొనసాగుతుండగా, గత 14 రోజులుగా పాకిస్తాన్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అసంఖ్యాకంగా ఉల్లంఘిస్తూ ఉగ్రవాద చర్యలకు ప్రోత్సాహం ఇస్తున్నట్లుగా భారత సైన్యం అభిప్రాయపడుతోంది.