LOADING...
Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్

Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
09:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

'అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని' అంటూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తీవ్రమైన అవమానకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు సాక్షి టీవీ ఛానల్‌ వేదికగా ప్రసారం కావడం వల్ల సంచలనం రేగింది. మహిళలపై ఇలా దారుణంగా మాట్లాడటం పై విపక్షాలు, పౌర సమాజం తీవ్రంగా స్పందించాయి. గత కొన్ని రోజులుగా కృష్ణంరాజు పరారీలో ఉంటూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నాడు. అయితే బుధవారం రాత్రి అతని సెల్‌ఫోన్‌ టవర్‌ సిగ్నల్స్ ఆధారంగా భీమిలి సమీపంలోని గోస్తనీ నది వద్ద అతని ఉనికి గుర్తించిన పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు.

వివరాలు 

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్

అతని వెంట ఉన్న మరొరెద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విశాఖపట్టణం నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టు సమాచారం అందింది. ఇక జర్నలిస్టుగా వ్యవహరిస్తున్న వీవీఆర్‌ కృష్ణంరాజు, అలాగే సాక్షి టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావుపై అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసి, మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమండ్ విధించింది.