Sanjiv Khanna: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ప్రమాణం చేశారు. ఎన్నికల బాండ్లు, అధికరణం 370 వంటి ప్రధాన కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చిన జస్టిస్ ఖన్నా, రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఆదివారం వరకు పదవిలో ఉన్న జస్టిస్ డివై చంద్రచూడ్ సీజేఐగా తన పదవీకాలం ముగించుకున్నారు.